24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రేషన్ కార్డుల, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్

 

కామారెడ్డి ,బతుకమ్మ : రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. గురువారం దోమకొండ మండలం చిత్తమాన్ పల్లి, బీబీపెట్ మండలం తుజల్పూర్ గ్రామాలలో రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ల తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా సర్వే పనులు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే పనులు కొనసాగించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట రెవిన్యూ, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

Survey of ration cards and Indiramma houses should be conducted properly

More articles

Latest article