30.9 C
Hyderabad
Monday, August 3, 2026

విప్లవోద్యమ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర 

Must read

📰 Generate e-Paper Clip

 – విప్లవ పోరాటల్లో యువత క్రియాశీలకంగా ముందు నిలువాలి 

  – సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్

 

సిరికొండ, బతుకమ్మ : విప్లవోద్యమ నిర్మాణంలో యువత పాత్ర కీలకమైనదని, విప్లవ పోరాటల్లో యువత క్రియాశీలకంగా నిలబడాలని  సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్  పిలుపునిచ్చారు . సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న గడ్కోల్ అమరవీరుల స్మారక క్రీడల ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో యువతరం మత్తు పదార్థాలు, మతంలో పడి సమాజం పట్ల బాధ్యతలను విస్మరిస్తున్నారన్నారు.దేశంలో విభజన రాజకీయాలు  సమాజం పట్ల యువతను  ఆలోచించనీయకుండా చేస్తున్నాయని,ఒకవైపు  నిరుద్యోగం, అధిక ధరలు నిత్యం పెరిగిపోతుంటే యువతరం  ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. యువతరం పోరాటంలో మమేకమై  సమాజ మార్పు కోసం నడుము బిగించాలన్నారు. ప్రభుత్వాలు మద్యాన్ని విచ్చలవిడిగా పెంచి  యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. యువతరం ప్రభుత్వ కుట్రలను పసిగట్టి చిత్తు చేయాలన్నారు. క్రీడలను యువతరం  తమ చైతన్యం కోసం, శారీర దృఢత్వం కోసం ఉపయోగించుకొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమంలో తమ భుజం కలపాలన్నారు. గడ్కోల్ గ్రామం  విప్లవాల కేంద్రమని సీపీఐ (ఎం. ఎల్ ) ప్రజాపంథాకు పట్టుగోమ్మ అని విప్లవ ఉధ్యమాలకు పుట్టినిల్లు అన్నారు. అతివాద, అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా గ్రామం ఉద్యమ స్ఫూర్తిని అందించిందన్నారు.యువకులు సమాజం పట్ల బాధ్యతతో మెదలలని,గడ్కోల్ అమరవీరులను స్మరించుకుంటూ క్రీడాలను నిర్మించుకోవడం అభినందనీయం అన్నారు.     కార్యక్రమంలో  సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి బి.దేవారంలు ప్రసంగించగా, జిల్లా నాయకులు ఎం.ముత్తేన్న, కె.గంగాధర్,ఎస్.సురేష్,ఆర్.రమేష్,జి.సత్తేవ్వ,  డివిజన్ నాయకులు ఆర్.దామోదర్,బి . బాబన్న, జి.సాయరెడ్డి, మండల నాయకులు ఎం.లింబాద్రి,ఈ.రమేష్,బి.కిశోర్, పి.రమ,కె.రాంజీ, ఎస్.కిశోర్,ఎం. డి అనిస్, జె.బాలిరెడ్డి,జి కిరణ్, జె.ఎర్రన్న, కట్ట. రాములు, ఎం.హరీష్, బి.అక్షయ్,బి.రమేష్,ఎం.ప్రతిప్,కె.వెంకటి,బి.లక్ష్మణ్, ఏ.వినోద్,ఎస్.మనిదీప్,పీ. డీ లు మల్లేష్ గౌడ్, సురేష్, యాదగిరి, నవీన్,పీ.ఈ. టీ లు జలందర్, శశి, సాయిలు, గంగాధర్, వాసు తదితరులు పాల్గొన్నారు.

Youth plays a vital role in the formation of revolutionary movement

More articles

Latest article