30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పల్నాటి కార్తీక్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నిజామాబాద్ నగరానికి చెందిన పల్నాటి కార్తీక్ నియమితులయ్యారు. రాష్ర్ట అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్ నూతన కార్యవర్గాన్నిమంగళవారం ఏర్పాటు చేశారు. 15 ఏళ్లుగా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి చురుకుగా పనిచేస్తున్న కార్తీక్ సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం రాష్ట్రకార్యవర్గంలోకి తీసుకుంది. గతంలో బీజేవైఎం నగర ప్రధానకార్యదర్శిగా పని చేసిన కార్తీక్, అసెంబ్లీ కన్వీనర్ గా, ప్రస్తుతం 25 డివిజన్ శక్తికేంద్ర ఇన్ చార్జిగా పని చేస్తున్నారు. తనపై నమ్మకంతో రాష్ర్ట కార్యవర్గంలోకి తీసుకున్న రాష్ర్ట కమిటీకి, అందుకు సహకరించిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణకు కార్తీక్ ధన్యవాదాలు తెలిపారు. యువమోర్చా బలోపేతానికి, పార్టీ ఎదుగుదలకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. కార్తీక్ నియమాకంపై  బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

More articles

Latest article