29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  :

యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలంపాటి హరికృష్ణ అన్నారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయం వద్ద బిజెపి నాయకులు, కార్యకర్తలు స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలంపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని అన్నారు. ప్రతి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు ప్రశాంత్ గౌడ్, పార్వతి మురళి, వడ్ల సాయినాథ్, బీజేవైఎం అధ్యక్షులు కుమ్మరి గణేష్, సతీష్ పవర్, సాయి కుమార్, అనిల్, బేగరి వినోద్, రాజశేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article