ఆర్మూర్, బతుకమ్మ :
నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో ముందుండాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలంలోని ఇసాపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ యువత పుస్తకాలకే పరిమితం కాకుండా దేశం కోసం, ధర్మం కోసం, త్యాగం చేసినటువంటి త్యాగ పురుషుల జీవితాలను చదివి ఎంతటి సమస్యనైనా ధైర్య తో ఎదుర్కొనేటటువంటి శక్తిని మానసింగా పెంపొందించుకోవాలని దానికోసం భగవద్గీత తో పాటే ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ లాంటి ఆటలు ఆడాలని అన్నారు. దేశం నాకు ఓ 50 మంది వజ్రకఠోరమైనటువంటి, ఉక్కు కండలు కలిగినటువంటి యువకులను ఇస్తే ఈ దేశ భౌగోళిక పరిస్థితులను మారుస్తానని చెప్పినటువంటి వివేకానంద స్ఫూర్తితో ఈరోజు భారతదేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, ఇస్సపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ ముత్యంరెడ్డి, బిజెపి పట్టణ కార్యదర్శి మిరియాల్కర్ కిరణ్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ గౌడ్, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పీర్ సింగ్ నాయక్, భానుచందర్, గణేష్, చిన్న ముత్తన్న, సుదర్శన్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
