యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

ఆర్మూర్, బతుకమ్మ : నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో ముందుండాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలంలోని ఇసాపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ యువత పుస్తకాలకే పరిమితం కాకుండా దేశం కోసం, ధర్మం కోసం, త్యాగం చేసినటువంటి త్యాగ పురుషుల జీవితాలను చదివి...