. . . నీట మునిగిన పంటలు . . . ఇండ్లలోకి చేరి నీరు
కరీంనగర్, బతుకమ్మ :
శ్రీరాంసాగర్ ప్రధాన కాలువకు గండిపడింది. ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో ఎస్సారెస్పీ కాలువకు గండి పడింది. దాంతో మన్నెంపల్లిలోని ఇండ్లలోకి నీరు చేరింది. పంటలు నీటమునిగాయి. విషయం తెలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

