రుద్రూర్, బతుకమ్మ : అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన రుద్రూర్ లో చోటు చేసుకుంది. రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపిన వివరాలు ప్రకారం .. రుద్రూర్ గ్రామానికి చెందిన నేకంటి శారద (34) అను ఆమె కడుపునొప్పి, ఫీట్స్ సమస్యతో బాధపడుతూ అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం రుద్రూర్ గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై సాయన్న వెల్లడించారు.
