27.3 C
Hyderabad
Friday, July 31, 2026

బీ(టీ)ఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం 

Must read

📰 Generate e-Paper Clip

  • అందరిని జైల్లో వేసిన హామీల అమలుకు పోరాడుతాం 
  • కార్యకర్తలందరు ప్రభుత్వం పై పోరుకు సిద్దమవ్వాలి
  • మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 

 

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రజల చిరకాల వాంచ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్బవించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాజధానిలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ 2025 నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ తన పదవులను త్యాగం చేసి, ఎన్ని ఆఅటుపోట్లు ఎదురైనా మొక్కవోని దైర్యం తో 15 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారన్నారు. నూతన రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలతో పది సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజలకు సుపరిపాలనను అందించి దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపారన్నారు.ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దాలు, సాధ్యం కానీ హామీలను ప్రజలకు ఎర చూపి కొద్దీ తేడాతో రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన రేవంత్ రెడ్డి డైవర్షన్ పొలిటిక్స్ ను నడుపుతున్నారని ఆయన అన్నారు. ప్రశ్నించిన వారి పై , ప్రభుత్వ వైఫాల్యాలను ఎండడగట్టిన వారిపై రేవంత్ ప్రభుత్వం అక్రమ కేసులు, చెత్త లొట్టపీసు కేసులను పెడుతున్నారని ఆయన ఆరోపించారు. సీ. ఎం హామీల అమలు పై ప్రజల తరపున పోరాడుతున్న కేటీఆర్ ను ఇరికించి జైలు కు పంపాలని గత రెండు నెలలుగా ఈ కార్ రేసును ఎంచుకున్నాడని అన్నారు. కేటీఆర్ తో పాటు సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు పై కూడా రేవంత్ కేసు పెట్టిన విషయం తెలిసిందేనన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులందరిపై అక్రమ కేసులు పెట్టాలని సీ.ఏం చూస్తున్నారని ఆయన అన్నారు. ఎన్ని కేసులు చేసిన,అందరిని జైల్లో వేసిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు సీ. ఎం ను వెంటాడుతామని హెచ్చరించారు.పార్టీ ప్రతి కార్యకర్త ప్రభుత్వ హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమవ్వాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

B(T)RS party was born for Telangana

More articles

Latest article