నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ను రాష్ర్ట అధ్యక్షుడు మారం జగదీశ్, కార్యదర్శి ముజీబ్ తోపాటు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆవిష్కరించారు. నగరంలోని శ్రావ్య గార్డెన్ లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాశెట్టి సుమన్, నేతికుంట శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, టీఎన్జీవోస్ రాష్ర్ట నాయకుడు గైని గంగారాం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీవోస్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.
