25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉచిత కంటి వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్,  బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని రాణంపల్లి గ్రామంలో గల గ్రామ సచివాలయం వద్ద మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ధాత్రి శ్రీ ఫౌండేషన్ సహకారముతో ఉచిత కంటి, దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిభిరంలో లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నేరెళ్ల సతీష్ వారిచే కంటి వైద్య పరీక్షలు, బోధన్ డాక్టర్ ఇర్ఫాన్ ఆలి లైఫ్ కేర్ హాస్పిటల్ వారిచే దంత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ ఉచితంగా మందులు అందజేశారు. అదేవిధంగా ఈ శిబిరంలో 116 మందికి చికిత్సలు చేయడం జరిగిందన్నారు. ఇందులో 19 మంది రోగులకు మోతిబిందు ఆపరేషన్ నిమిత్తం లయన్స్ కంటి ఆసుపత్రి రాకాసిపేట బోధన్ కు ఉచిత ఆపరేషన్ కొరకు పంపడం జరిగింది అని ధాత్రి ఫౌండేషన్ అధ్యక్షులు గాండ్ల మధు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ రుద్రూర్ సభ్యులు లయన్ శ్యాంసుందర్ పహాడే, లయన్ గాండ్ల మధు, లయన్ సాయికిరణ్, లయన్ ప్రశాంత్ గౌడ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article