29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తండ్రి చనిపోయాడు.. తల్లి జైలులో ఉంది

Must read

📰 Generate e-Paper Clip

. నా అనే వారు లేకపోవడంతో బయట తిరుగుతున్న అన్నాదమ్ముళ్లు

మాక్లూర్, బతుకమ్మ: తండ్రి చనిపోయాడు.. తల్లి జైలులో ఉంది. నా అనే వారు లేక ఆ పిల్లలు బయట తిరుగుతుండడాన్ని గమనించిన మాక్లూర్ పోలీసులు వారిని స్టేషన్ కు చేర్చారు. సోమవారం ఉదయం దాస్ నగర్ అటవీ ప్రాంతంలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గుర్తించిన కానిస్టేబుళ్లు వారిని వెంటనే పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి వివరాలు ఆరా తీశారు. తమ పేర్లు రావుల మనోజ్, రావుల మధు అని, తమది అడవి మామిడిపల్లి గ్రామమని తెలిపారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారని పోలీసులు ప్రశ్నించగా, తమ తండ్రి చనిపోయాడని, తల్లి జైలులో ఉందని, ఏం చేయాలో తెలియక బయట తిరుగుతున్నామని వారు సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులు వారిద్దరిని స్టేషన్ లోనే ఉంచారు. పిల్లల తరఫున ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు.

More articles

Latest article