- రూరల్ ఎంఎల్ఏ రేకులపల్లి భూపతిరెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : గురువులకు సమాజంలో గౌరవస్థానం ఉందని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. ఎంఎల్ఏ క్యాంప్ ఆఫీస్ లో ఆదివారం స్టేట్ టీచర్స్ యూనియన్ టేబుల్ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు తాము పొందిన విజ్ఞానం ను ముందు తరాలకు అందిస్తారని అన్నారు. సంఘం యొక్క ఆవశ్యకత అందరికీ ఉంటుంది అని, ఎస్టీయూ స్వాతంత్ర్యమునకు ముందు ఏర్పడి ఈ రోజు ఉపాధ్యాయులు పొందుతున్న అనేక సౌకర్యాలు కల్పించింది అని అన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది, దానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పేద విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ధర్మేందర్,ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ (వాసు),జిల్లా కార్యవర్గ సభ్యులు బాల చంద్రం , యాదగిరి,పవన్ కుమార్, గంగకిషన్,సాయిబాబా,మల్లయ్య, హరికృష్ణ, సన ఉద్దీన్ పాల్గొన్నారు.

