నిజామాబాద్, బతుకమ్మ :ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా జరపాలని ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ ఏ.దీనారాణి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవడం మనందరి అదృష్టమని అన్నారు. సావిత్రిబాయి పూలే సంఘసంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి అని తెలిపారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలలో ప్రారంభించి తదుపరి 57 పాఠశాల నెలకొల్పి బాలికలకు విద్యకు పూనుకున్నారని తెలిపారు. గౌరవ అతిథులుగా హాజరైన ఐసిడిఎస్ గ్రేడ్ వన్ ఆఫీసర్ తెలంగాణ మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆహ్వానిచ్చి సన్మానించినందుకు సంఘ ప్రెసిడెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాపులు అందరం కూడా ఐక్యతతో అభివృద్ధి సాధించే దిశలో అందరూ కృషి చేయాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు తోట రాజశేఖర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు అందరు కూడా చురుకైన పాత్ర పోషించి సమాజంలో కాపుల ఐక్యతకు పాటుపడాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రబ్బాపూర్ రవి స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బుస ఆంజనేయులు, కోశాధికారి బాసెట్టి సురేష్, ముఖ్య సలహాదారు ఆకుల ప్రసాద్, సహా అధ్యక్షులు జిలకర కిషన్, పెద్దోళ్ల నాగరాజ్, ఉపాధ్యక్షులు హరిచరణ్ , శంకర్, నిర్వాణ కార్యదర్శి ఏ శ్రీనివాస్, సల్ల సత్యనారాయణ, శేఖర్, సబ్యుక్త కార్యదర్శి మహిళా కార్యదర్శి పుష్ప కుమారి, ఎండల స్వప్న, సలహాదారులు చిట్టి నారాయణరెడ్డి, జనార్దన్ పటేల్, అబ్బాయి లింబాద్రి సంక్షేమ సంఘం సభ్యులు 100 మంది పాల్గొన్నారు.
