మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం
నిజామాబాద్, బతుకమ్మ :ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా జరపాలని ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ ఏ.దీనారాణి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా...