. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ
నిజమాబాద్ సిటీ బతుకమ్మ..
నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి నియోజకవర్గనికి పోయిన నిధుల్లో కనీసం 25% తెచ్చే దమ్ము ఉందా, కాంగ్రెస్ నాయకులు నిజంగా అలా నిధులు తెస్తే తను స్వయంగా కాంగ్రెస్ పెద్దలను బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్తానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు.భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో సావిత్రి బాయ్ పులే 194వ జయంతి సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతు.. నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా,నగరంలో ఆగిపోయిన పనులను ప్రారంభించే దిశగా, పెండింగ్ లో ఉన్న నిధుల మంజూరుకై నిరంతరం ప్రభుత్వంతో మాట్లాడుతు సంబంధిత మంత్రులకు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. అలాగే నియోజకవర్గం అభివృద్ధి పై ఎప్పటికప్పుడు ఇక్కడ జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించి డివిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలియజేసారు. నియోజకవర్గానికి రావలిసిన ఫండ్ 60 కోట్లు గత ప్రభుత్వం హయాంలో డివిజన్ కి కోటి రూపాయల చొప్పున మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని నిలిపేసి అభివృద్ధికి అడ్డుగా నిలిచింది వాస్తవం అని అన్నారు. తను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి పెండింగ్ లో ఉన్న టి యుఎస్ఐడిసి ఫండ్ రూ. 60 కోట్ల బకాయి విడుదల చేయాలనీ ఇంచార్జ్ మంత్రి జూపల్లి , కలెక్టర్ కి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతే మన జిల్లాకు రావలిసిన ఫండ్ హక్కుగా కొట్లాడి తేవడం జరిగిందని అన్నారు. దాన్ని కాంగ్రెస్ నాయకులు ఏదో కొత్తగా, కొత్త సంవత్సరంకి బహుమతి ఇచ్చినం అని మతి లేని మాటలు మాట్లాడటం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేత కాదు కాని ఎవరికో పుట్టిన బిడ్డ మాదే అని ఎత్తుకొని ముద్దాడటం బాగా వచ్చుని ఏద్దేవా చేసారు. కాంగ్రెస్ నాయకులు చేసే కమిషన్ల దోపిడీకి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదని పెండింగ్ లో ఉన్నకాంట్రాక్టర్ల బిల్లులు మంజూరుకి కమిషన్ల కోసం కసరత్తులు చేస్తున్నారని అన్నారు. కమిషన్ల పైన ఉన్న శ్రద్ద, రాష్ట్ర అభివృద్ధి పైన లేకపోవడం నిజంగా సిగ్గుచేటని పేర్కొన్నారు. జిల్లాలో పేరుకే కాంగ్రెస్ నాయకులు పెద్ద పదవుల్లో ఉన్నారు కాని జిల్లా అభివృద్ధికి తెచ్చిన నిధులు శున్యం అని అన్నారు. పీసీసీ అధ్యక్షులు ఒకాయన, కామారెడ్డి లో చెల్లని రూపాయి ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభుత్వ సలహాదారుడు ఒకాయన, ఇందరు ఉన్న జిల్లా అభివృద్ధి పట్టించుకునే సోయి లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

