24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏకసభ్య కమిషన్ చైర్మన్ డా. షమిమ్ అక్తర్ కు ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ వినతిపత్రం

 

నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని ఏకసభ్య కమిషన్ చైర్మన్ డా. షమిమ్ అక్తర్ కు గురువారం ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ మాట్లాడారు.

Classification of SC reservations should be done according to population ratio

 ఏక సభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీం అక్తర్ ను మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కలిసి వర్గీకరణను అత్యంత తొందరగా 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎవరి జనాభా ఎంతో వారి వాటాగా వర్గీకరించాలని కోరామని తెలిపారు.

Classification of SC reservations should be done according to population ratio

గత 75 ఏళ్ల నుంచి మాదిగలకు చదువుతున్న అన్యాయం గురించి కమిషన్కు వివరించామని తెలిపారు. ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా మాదిగ, మాదిగ ఉపకులాలకు అలాగే మాల ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి సమాజ మొత్తం అటుంది అలాగే ప్రభుత్వాలు వేసిన కమిషన్లు కూడా బలహీన చేయాలని చెప్పేసి ప్రభుత్వం విన్నవించామని తెలిపారు. 1994లో ఎంఆర్పిఎస్ ఏర్పడినప్పటి నుండి మాదిగ హక్కుల కోసం, మాదిగ ఉపకులాల హక్కుల కోసం నిరంతరం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇందులో 2000 – 2004 మధ్యలో ఏబిసిడి వర్గీకరణ రావడం ద్వారా మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఎన్నో అవకాశాలు విద్యా ఉద్యోగ రంగాల్లో రావడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, ఎం ఎస్ పి నాయకులు, ఎమ్మెస్ ఎఫ్ నాయకులు, ఎంఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.

Classification of SC reservations should be done according to population ratio

More articles

Latest article