బతుకమ్మ,మెండోరా: శ్రీరాంసాగర్ ప్రధాన కాలువైనటు వంటి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో దిగువన ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో వివిధ ఉత్పత్తి ప్రారంభమైందని జెన్ డీ ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రెండో యూనిట్, మూడవ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. యూనిట్ 2 ద్వారా 6.14 మెగావాట్స్, యూనిట్ 3 ద్వారా 7.20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని మొత్తం 13.34 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలియజేశారు.
వరద కాల్వకు నీటి విడుదల పెంపు
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వర్ధకాలువ ద్వారా నీటి విడుదల పెంచడం జరిగింది. మంగళవారం 2000 క్యూసెక్కుల నీటి విడుదల చేసిన విషయం తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 3000 క్యూసెక్కుల నీటి విడుదల పెంచడంతో ప్రస్తుతం 5000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రధాన కాలువైనటువంటి కాకతీయ సరస్వతి లక్ష్మి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. కాకతీయ కాలువ ద్వారా 5500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ 231 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1089.60 అడుగులు, 75.314 టీఎంసీల నీరు నిలువ ఉంది. గత సంవత్సరం ప్రాజెక్టులో ఇదే రోజు 1086.40 అడుగులు, 64.402 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి
