28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మహా సమ్మేళనం చారిత్రాత్మక ఘట్టం

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :  ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళన కార్యక్రమం విజయవంతమైందని పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షులు వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా పూర్వ విద్యార్థులు తరలివచ్చి సభా కార్యక్రమాన్ని విజయవంతం చేసి పాఠశాలలో వారు చదివిన సమయంలో జరిగిన తీపి గుర్తులను గుర్తు చేసుకుంటూ సమ్మేళనానికి విచ్చేసిన అందరూ కూడా ఆనందాయకంగా పాఠశాలలో గడపడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సంఘటన కార్యదర్శి దక్షిణ మధ్య క్షేత్రం సుధాకర్ జి  ఉపన్యాసం విని పూర్వ విద్యార్థులందరూ ఆనందాయకంగా వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారని తెలిపారు. ఈ సమావేశంలో, సలహాదారులు శ్రీనివాస్ ,ప్రిన్సిపల్ వినోద్ కుమార్ పూర్వ విద్యార్థులు ప్రసన్న గౌడ్, సడాక్ విజయ్ , రేగుల్ల శ్రీనివాస్, రజనీకాంత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article