మహా సమ్మేళనం చారిత్రాత్మక ఘట్టం
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళన కార్యక్రమం విజయవంతమైందని పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షులు వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా పూర్వ విద్యార్థులు తరలివచ్చి సభా కార్యక్రమాన్ని విజయవంతం చేసి పాఠశాలలో వారు చదివిన సమయంలో జరిగిన తీపి గుర్తులను గుర్తు చేసుకుంటూ సమ్మేళనానికి విచ్చేసిన అందరూ కూడా ఆనందాయకంగా పాఠశాలలో గడపడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సంఘటన కార్యదర్శి...