27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

గాడి తప్పిన శాంతిభధ్రతలు

Must read

📰 Generate e-Paper Clip

  • కోత్వాల్ లేని పాలనలో పెరిగిన నేరాలు
  • హత్య కేసులు మినహా అన్ని కేసులు పెరిగాయి
  • దొంగతనాలు పెరిగాయి… రికవరి తగ్గిపొయింది
  • గొలుసు దొంగతనాలు విపరీతంగా పెరిగినయ్
  • అత్యాచారాలు పెరిగాయి.. పొక్సోకేసులు వందదాటాయి

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో 2024వ సంవత్సరాన్ని నేర సంవత్సరంగా చెప్పవచ్చు. ఏడాదిలో నిజామాబాద్  కమిషనర్ కల్మేశ్వర్ నిక్కచ్ఛిగా వ్యవహరించి నేరాల నియంత్రణకు గట్టిగానే ప్రయత్నించారు. అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కావడంతో బదిలీ కోసం ప్రయత్నాలు చేసి అక్టోబర్ లో కేంద్ర సర్వీస్ కు బదిలీ చేయించుకున్నారు. కామారెడ్డి ఎస్పీ సింధూశర్మకు ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు. సింధూశర్మకు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల శాంతి భద్రతల పర్యవేక్షణ కత్తిమీద సాములా మారింది. ఈ నేపఁథ్యంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రత్యక్ష పాలన లేకపోవడంతో డివిజన్ స్థాయి అధికారి మొదలుకుని, ఇన్స్ పెక్టర్ లు, ఎస్ఎచ్ఓలు అంతగా నేరాల నియంత్రణను పట్టించుకున్నట్లు కనిపించలేదు. నిజామాబాద్ జిల్లాలో ఇసుక, స్యాండ్ మాఫియాకు పోలీస్ ల అండదండలు  ఉన్నాయని ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగా  ఇద్దరు సీఐలను 11మంది ఎస్ఐలను లూప్ లైన్ కు పంపించారంటే పోలీస్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను వ్యక్తిగత ఆదాయ వనరులుగా పోలీస్ స్టేషన్ లను సివిల్ పంచాయితీలకు అడ్డాలుగా మార్చారని చెప్పవచ్చు. జిల్లాలో 34 ఇసుక అక్రమ తవ్వకాల కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం.

నిజామాబాద్ జిల్లాలో 2024లో నమోదైన ఎఫ్ఐఆర్ లతో నేరాల సంఖ్య 1.27 ఎఫ్ఐఆర్ ల పెరుగుదల మొత్తంగా 8,745 ఎఫ్ఐఆర్ లు అన్ని పోలీస్ స్టేషన్ లలో నమోదయ్యాయి.

నిజామాబాద్ జిల్లాలో 2024లో 42 హత్యలు జరగడం ఒక్కటే గత ఏడాదితో పోలిస్తే హత్య కేసుల సంఖ్య తగ్గాయని డీసీఆర్బీ రికార్డులు చెబుతున్నాయి. 47 హత్యాయత్నాలు,13సామూహిక దాడులు, 3 అల్లర్ల కేసులు నమోదు కాగా ఈ సారి అత్యధికంగా 57 కిడ్నాప్ కేసులు నమోదు కాగా, అత్యధికంగా ఈ సంవత్సరమే 77 రేప్ కేసులు నమోదయ్యాయి. 946దాడుల కేసులు నమోదు కావడం  గమనార్హం. మొత్తంగా 1185 కేసులు నమోదు కొత్త రికార్డును నమోదు చేసింది. నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్యల కేసులు గణనీయంగా పెరిగాయి. జిల్లాలో 442 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

2024లో దొంగతనాల సందర్భంగా  6గురు హత్యకు గురయ్యారు. ఒక దారిదోపిడీ కేసు, 33 దోపిడీ కేసులు , 38 పట్టపగలు దొంగతనాల కేసులు, 350  రాత్రి వేళ ఇళ్లలో దొంగతనాల కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 37 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ట్రాన్స్ ఫార్మర్ కాయిల్ దొంగతనాల కేసులు  165, వాహనాల దొంగతనాల కేసులు 431 నమోదు కాగా, ఇతర దొంగతనాల కేసులు 227 కేసులు నమోదయ్యాయి. అందులో మొత్తంగా జిల్లాలో 1289 కేసులకు గాను 407 కేసులు మాత్రమే ఛేదించారు. 31శాతంగా అది నమోదైంది. 2024లో రూ.8,44,33,882 సొత్తు చోరీకి గురికాగా రరూ.2,02,13,464 సొత్తు రికవరీ జరిగింది. దొంగతనాల కేసులు భద్రత వైఫల్యాన్ని చెబితే రికవరీ లేకపోవడం పరిశోధన లోటుపాట్లను తేల్చాయి.

జిల్లాలో ఈ సంవత్సరం 322 యాక్సిడెంట్ కేసులు నమోదు కాగా 335 మంది చనిపోయారు. సాధారణ రోడ్డు ప్రమాద కేసులు 509 నమోదు కాగా 758మందికి గాయాలయ్యాయి.

నిజామాబాద్ జిల్లాలో 2024లో వైట్ కాలర్ కేసులు విపరీతంగా పెరిగాయి. 722 చీటింగ్ కేసులు నమోదైతే, ఫేక్ కరెన్సీ కేసు ఒకటి, డబ్బును ఆశగా చూపి మోసం చేసిన కేసులు 20 నమోదయ్యాయి. మొత్తంగా 743 కేసులు నమోదు కావడం దారుణం. జిల్లాలో గత రెండు సంవత్సరాలతో పోలీస్తే సైబర్ క్రైం కేసుల అత్యధికంగా 376 నమోదు అయ్యాయి.  జిల్లాలో 7190 ఈ పెట్టి కేసులు నమోదు కాగా అందులో 6269 కేసులు పరిష్కరించారు.

నిజామాబాద్ జిల్లాలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు కొదవే లేదు. 2024లో మూడు వరకట్నపు చావు కేసులు నమోదు కాగా 326 వేధింపుల కేసులు, శారీరకంగా వేధించిన కేసులు 214, ఈవ్ టీజింగ్ కేసులు 50 నమోదయ్యాయి. జిల్లాలో ఈ సంవత్సరం అత్యధికంగా పొక్సో కేసులు 115 నమోదయ్యాయి. ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 101 నమోదయ్యాయి.

స్పెషల్ అండ్ లోకల్ లా కేసులు ఈ సంవత్సరం విపరీతంగా పెరిగాయి. అక్రమంగా ఆయుధాలు కలిగిన కేసులు ఒకటి నమోదు కాగా, పేలుడు పదార్థాల కేసులు 3 నమోదు చేశారు. జిల్లాలో పత్తాలాట కేసులు 569, ఎక్సైజ్ ఆక్ట్ కేసులు 169 నమోదయ్యాయి. గంజాయి ఇతర మత్తు  పదార్థాల కేసులు 22 నమోదయ్యాయి. జిల్లాలో ఈ చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 3,04,914 నమోదు కాగా, అందులో రూ.11,40,66,400 జరిమానా విధించారు. 7698 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో రూ.88,90451 జరిమానాలు వసూలు చేయగా 165మందికిజైలు శిక్షపడింది. జిల్లాలో గేమింగ్ కేసులు 518 కేసులలో 2179మందిని పట్టుకుని వారి నుంచి రూ.62,16,575 రికవరీ చేశారు. 51మట్కా కేసుల్లో 111 నుంచి రూ.1,85,985 సీజ్ చేశారు. జిల్లాలో గుట్కాపై నిషేధం విధించిన తరువాత వినియోగం పెరిగింది. గుట్టుచప్పుడు కాకుంగా గుట్కా రవాణా అవుతోంది. ఈ సంవత్సరం  11కేసులు నమోదు చేసి రూ.80,96,157విలువైన గుట్కాను  సీజ్ చేశారు.

నిజామాబాద్ జిల్లాలో తొలిసారి కొకైన్ పట్టుబడింది. 12.3గ్రాముల కొకైన్ రాజాస్థాన్ నుంచి రాజధానికి కారులో తరులుతుండగా టోల్ ప్లాజావద్ద పట్టకున్నారు. నిజామాబాద్ జిల్లాలో 22 గంజాయి కేసులు  నమోదు కాగా 58మందిని పట్టకున్నారు. వారి నుంచి 39కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే నిషేధిత మత్తు పదార్థమైన అల్ఫ్రజోలం 996  గ్రాములు, డైజోఫాం 1732 గ్రాములు, క్లోరోఫాం 1956 గ్రాముల స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ ఆక్ట్ లలో మొత్తంగా రూ.22,36, 520 విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్య అక్రమ రవాణా దందా కట్టలు తెంచుకుంది. జిల్లాలో 81కేసుల నమోదు కాగా 110మందిని అరెస్ట్ చేసి 7259క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని  విలువ రూ.1,35,03,143 ఉందని లెక్కలు చెబుతున్నాయి.

జిల్లాలో మిస్సింగ్ కేసులు ఆందోళన కలిగించే రీతిలో నమోదయ్యాయి. 873 హైయెస్ట్గా ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. అందులో 984మంది కనిపించకుండా పోగా, 846 మందిని గుర్తించారు. ఇప్పటికీ 138మంది ఆచూకీ దొరకలేదు. జిల్లాలో 18సంవత్సరాల లోపు చిన్నారుల మిస్సింగ్ కేసులు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. 140 కేసులలో 140మంది పిల్లలు తప్పిపోగా 130 మందిని మాత్రమే వెతికి గుర్తించారు. ఇప్పటికీ 10మంది చిన్నారుల ఆచూకీ చిక్కలేదు. జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా  139 మంది వీధి బాలలను బాలకార్మకులను గుర్తించి 136 మందిని  తల్లి దండ్రులకు అప్పగించగా ముగ్గురిని పరిశీల గ్రుహానికి తరగించారు.

జిల్లాలో డయల్ 100 ఫోనుకు 61606 కాల్స్ వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అందులో కొట్లాటకు సంబంధించి 3882 కాల్స్ రాగా రోడ్డు ప్రమాదాలపై 1934, దొంగతనాలు దోపిడీ గురించి 2044 కాల్స్ వచ్చాయని ప్రజల ఆస్తుల ధ్వంసంతో పాటు ఆత్మహత్య యత్నాలపై 6కాల్స్ వచ్చాయని, అనుమానితులు, గుర్తు తెలియని డెడ్ బాడీల గురించి 50,237 కాల్స్ రాగా, 3203 ఫేక్ కాల్స్ వచ్చాయి.

నిజామాబాద్ జిల్లాలో 142 ఇన్సిడెంట్ లలో షీ టీంలు స్పందించాయ . 99 ఈ పెట్టీ కేసులు నమోదు చేయగా, 4 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 39మందికి కౌన్సిలింగ్ ఇవ్వగా 63అవగాహక కార్యక్రమాలు నిర్వహించాయి.

More articles

Latest article