26.2 C
Hyderabad
Monday, August 3, 2026

టీఎస్ఎస్ డబ్ల్యూజేఏ రాష్ట్ర అధ్యక్షులుగా కాదేపురం గంగన్న

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కాదేపురం గంగన్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీర్కూర్ మండల సామాన్య జర్నలిస్ట్ నుండి రాష్ట్ర స్థాయిలో జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షుడి స్థానానికి ఎదిగారు. బీర్కూర్ మండలంలో ప్రధాన పత్రికలైన ఆంధ్రప్రభ, సూర్య, ప్రజాశక్తి, నమస్తే తెలంగాణ పత్రికలలో మండల స్థాయి విలేకరిగా పనిచేశారు. తదనంతరం నమస్తే తెలంగాణ, దిశ పత్రికలలో బాన్సువాడ ఆర్. సీ ఇంచార్జిగా పనిచేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఉదయం దిన పత్రికలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా 2019 లో ఏర్పాటైన తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లో ఫౌండర్ సభ్యులుగా ఉన్న కాదేపురం గంగన్న ఐడేండ్ల పాటు రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా కొనసాగారు. అయన పనితనాన్ని గుర్తించిన రాష్ట్ర సంఘం అయనను రాష్ట్ర అధ్యక్షునిగా హైదరాబాద్ లోని హోటల్ పద్మినిలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం హర్షనీయం. అయన బరంగ్ ఏడ్గి గ్రామంలో 1976 జూన్ 12 వ తేదీన కాదేపురం గంగయ్య – సుందరవ్వ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. అయన విద్యాభ్యాసం బరంగ్ఏడ్గి, వర్ని, నిజామాబాద్ లలో జరిగింది. రెక్కాడితే డొక్కాడని కుటుంబంలో పుట్టిన అయన ఇప్పటికీ పేదవాడయినప్పటికీ పేద వారికి సహాయం చేయడంలో ముందుంటారు. అదేవిధంగా చిన్నపెద్ద తేడాలేకుండా అందరినీ ఆప్యాయత మాట్లాడేతత్వం ఆయనది. గొడవలు, వివాదాలకు ఆమడ దూరంలో ఉండే ఆయనకు సౌమ్యుడిగా పేరుంది. దళితవాది, అంబేద్కర్ వాదిగా పేరున్న అయన దళితులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే స్పందించి, సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో మంచి సంబంధాలు పెట్టుకొని అందరికీ ఆప్తుడిగా ఉంటారాయన. అనంతరం అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ను బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అక్రిడిటేషన్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు ప్రాధాన్యత కల్పించేందుకు పాటుపడతానన్నారు.

More articles

Latest article