టీఎస్ఎస్ డబ్ల్యూజేఏ రాష్ట్ర అధ్యక్షులుగా కాదేపురం గంగన్న

బాన్సువాడ, బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కాదేపురం గంగన్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీర్కూర్ మండల సామాన్య జర్నలిస్ట్ నుండి రాష్ట్ర స్థాయిలో జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షుడి స్థానానికి ఎదిగారు. బీర్కూర్ మండలంలో ప్రధాన పత్రికలైన ఆంధ్రప్రభ, సూర్య, ప్రజాశక్తి, నమస్తే తెలంగాణ పత్రికలలో మండల స్థాయి విలేకరిగా పనిచేశారు. తదనంతరం నమస్తే తెలంగాణ, దిశ పత్రికలలో బాన్సువాడ ఆర్. సీ ఇంచార్జిగా పనిచేశారు....