29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తైక్వాండో అసోసియేషన్ నిజామాబాద్ కు ఎలాంటి గుర్తింపూ లేదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : తైక్వాండో అసోసియేషన్ నిజామాబాద్ సంఘానికి ఎలాంటి గుర్తింపూ లేదని క్రీడాకారులు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి కే.మనోజ్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య తెలిపారు. ఈనెల 29న ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగే జిల్లాస్థాయి టోర్నమెంట్ కు నిజామాబాద్ తైక్వాండో అసోసియేషన్ నుంచి గాని, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ నుంచి గాని, డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి గాని ఎలాంటి గుర్తింపు లేదని తెలిపారు. కొందరు పొట్ట గడుపుకోవడానికి బోగస్ సంఘాల పేరుతో సంఘాలు ఏర్పాటు చేసి ఆ సంఘాలు ఇచ్చిన సర్టిఫికెట్లు దేనికి ఉపయోగపడవని తెలిపారు. ఈ టోర్నమెంట్ లో ఎంట్రీ ఫీ రూ.1500 పెట్టినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇది కేవలం పొట్ట గడుపుకోవడానికి సంఘాలను ఏర్పాటు చేసి క్రీడాకారులకు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘాలకు ప్రోత్సహిస్తే దేనికి ఉపయోగ ఉండదని అన్నారు. గుర్తింపు లేని క్రీడ సంఘాల పట్ల తల్లిదండ్రులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి సంఘాలకు త్వరలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు గుర్తింపు సంఘాలు క్రీడాపోటీలను ఏర్పాటు చేసినప్పుడే క్రీడా పోటీలకు పంపాలని కోరారు. జిల్లా క్రీడా సంఘానికి, రాష్ట్ర క్రీడా శతకం, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా ఒలంపిక్ సంఘం గుర్తింపు ఇచ్చినప్పుడే సంఘానికి గుర్తింపు వుంటుందని అన్నారు.

More articles

Latest article