25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

 శ్రీరామ్ మహిపాల్ చారికి జాతీయ పురస్కారం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో జరిగిన అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర సదస్సులో నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. విశ్వకర్మ జాతికి చేసిన కృషికి గానూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని మహాసభ జాతీయ అధ్యక్షుడు చేడిలాల్ శర్మ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం చారి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీరామ్ మహిపాల్ చారి మాట్లాడుతూ, “ఈ పురస్కారం నాపై మరింత బాధ్యతను పెంచింది. విశ్వకర్మ జాతి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పైలేష్ కుమార్ సిద్ధప్పతో పాటు రాష్ట్ర నాయకులు, విశ్వకర్మ జాతి ప్రముఖులు పాల్గొన్నారు.

More articles

Latest article