శ్రీరామ్ మహిపాల్ చారికి జాతీయ పురస్కారం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో జరిగిన అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర సదస్సులో నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. విశ్వకర్మ జాతికి చేసిన కృషికి గానూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని మహాసభ జాతీయ అధ్యక్షుడు చేడిలాల్ శర్మ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం చారి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీరామ్ మహిపాల్ చారి మాట్లాడుతూ, "ఈ పురస్కారం...