29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రాష్ట్రస్థాయి  ఖోఖో పోటీలకు ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ పిట్లం :  పిట్లం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థినీలు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎందుకు కావటం అభినందనీయమని ఉపాధ్యాయ బృందం అభినందించారు.ఈ నెల 30వ తేదీ నుండి జనవరి 2వ తేదీ వరకు వరంగల్ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిట్లం విద్యార్థినిలు సుప్రీత, మహాలక్ష్మి లు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంజీవులు  తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి దేవి సింగ్,పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రూప్ సింగ్, ప్రకాష్, ప్రమోద్ ఉన్నారు.

More articles

Latest article