27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మన్మోహన్ సింగ్ సేవలు ఎన్నటికీ మరువలేనివి

Must read

📰 Generate e-Paper Clip

  • భారత జాతి గర్వించే ఆర్థిక వృక్షం లాంటి మహోన్నతుడు మన్మోహన్ సింగ్
  •  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి 

బతుకమ్మ, మోర్తాడ్:  భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు ఎన్నటికీ మరువలేనివని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహనరెడ్డి అన్నారు.  బాల్కొండ నియోజకవర్గం మానాల గ్రామంలో మండల అధ్యక్షులు జలపతి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిముఖ్యఅతిథిగా పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేశాన్ని ఆర్థిక రంగంలో,ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపిన మన్మోహన్ సింగ్, మరణం తీరనిలోటని, అదేవిధంగా పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ రథసారధిగా పార్టీ కోసం, అదేవిధంగా ప్రధానిగా, దేశ ప్రజలకు హక్కులు, కల్పించడంలో మన్మోహన్ సింగ్ ఆలోచన చిత్తశుద్ధి ఎన్నటికీ మరువలేనివనిఆయన కొనియాడారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చి,దేశ ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునే స్వేచ్ఛను హక్కును కల్పించిన మహోన్నత వ్యక్తి అనిఅన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలి దొరకని రోజుల్లో 100 రోజులు ఉపాధి హామీ పనిని తీసుకువచ్చి కూలీలకు పని కల్పించిన ఏకైక నేత మాన్మోహన్ సింగ్ అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా అమెరికాతో అను ఒప్పందం గాని, మరిముఖ్యంగా చిన్న భిన్నంగా ఉన్న,దేశ ఆర్థిక వ్యవస్థను, ఒక సరైన మార్గంలో పెట్టి ప్రతి ఒక్క భారతీయుడు తలెత్తుకునే విధంగా చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన 10 సంవత్సరాల ప్రధాని కాలంలో రూపాయి విలువను ఏ మాత్రం తగ్గకుండా చూశారని, దేశ చరిత్రలో మన్మోహన్ సింగ్ కంటే ముందు మన్మోహన్ సింగ్ తర్వాత అని చెప్పుకునే విధంగా చేశారని, మౌనంగా ఉంటూనే దేశ ప్రజల అభివృద్ధి కొరకు, దేశ అభివృద్ధి కొరకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయుడు మన్మోహన్ సింగ్అని మానాల మోహన్ రెడ్డి కొనియాడారు. గిరిజనుల పక్షాన నిలిచి,వారికి పోడు భూముల పట్టాలు అందించిన,వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు ఎన్నటికి మరువలేనివని, దేశం ఒక మంచి ఆర్థికవేత్తను, సలహాదారున్ని, మంచి మనిషిని కోల్పోయిందని, మన్మోహన్ సింగ్ ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ మానాల మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మానాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్,మోహన్,రవీందర్,హరిదాసు,రాజు,నాయక్, గురుదాస్,గజంలల్,బంకట్లల్,భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article