కామారెడ్డి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు హరిలాల్ నాయక్
కామారెడ్డి సిటీ, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘాన్ని కామారెడ్డి జిల్లా బహుజన సమాజ్ పార్టీ మంగళవారం మద్దతు తెలిపారు. జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్ మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ 13న అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘాన్ని మద్దతు తెలుపుతూ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్య పరిష్కరించి రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టు కోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఇప్పటికి వరకు ఉద్యోగుల సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేయడం సమన్యాయం కాదని బహుజన్ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నిరడి ఈశ్వర్, జుక్కుల్ అసెంబ్లీ అధ్యక్షులు రోహిత్, సాయిలు, రాములు, మారుతి, గంగాధర్, గైని సాయిలు, తదితరులు మద్దతు తెలిపారు.

