28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సావిత్రి బాయి పూలే పురస్కారాల కరపత్రాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బిసిటియు ఆధ్వర్యంలో జనవరి 5 వ తేదీన న్యూ అంబేద్కర్ భవనం లో నిర్వహించనున్న సావిత్రి బాయి పూలే పురస్కారాల కరపత్రాలను మంగవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్.భూపతి రెడ్డి వారి కార్యాలయాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం లోనే స్త్రీ విద్య ను మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన ఘనత పూలే దంపతులకు దక్కుతుందని, వారిని ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకుని భోధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్షి ఆర్ గోపాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కంచరి రవికుమార్, కొట్టూరు రామకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్, గౌరవ సలహాదారులు రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Savitri Bai Phule award leaflets were unveiled by the MLAs

More articles

Latest article