25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

కాంట్రాక్టర్లను ఆదేశించిన అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలో ప్రతి డివిజన్ కు 10 లక్షల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులు సీసీ రోడ్, డ్రైనేజీ పనులు నాణ్యతతో, త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఆదేశించారు. 7వ డివిజన్ చంద్ర నగర్ లో , 17వ డివిజన్ గౌతమ్ నగర్ లో , 35వ డివిజన్ హమాల్వడీ లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతు కిరణ్ తో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు జనరల్ ఫండ్ ధ్వరా ప్రతి డివిజన్ కు పదిలక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అర్బన్ నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు తగిన నిధులు మంజూరు చేయాలనీ ఇంచార్జ్ మంత్రి జూపల్లి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు 7 వ డివిజన్ సుక్క మధు, 17 వ మాయావర్ సవిత, 35 వ డివిజన్ ఎర్రం సుధిర్,తదితరులు పాల్గొన్నారు.

Development works should be done with quality

More articles

Latest article