నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సివిల్ సప్లై అధికారుల సమక్షంలో మంగళవారం అధ్యక్షులు జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్, సివిల్ సప్లై డిఎం ఏఎస్ఓ రవికుమార్ రాథోడ్, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇందూరు కన్జ్యూమర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్, సంయుక్తకార్యదర్శిలు మహాదేవుని శ్రీనివాస్, గైని రత్నాకర్ ల సమక్షంలో వినియోగదారుల హక్కులు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో నేరాలు ఘోరాలు మోసపూరిత ప్రకటనలు ఆన్లైన్ మోసాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతున్న కల్తీలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో ప్రక్క విద్య, వైద్యం, వ్యాపారంగా మారడం, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్స్ ,రియల్ ఎస్టేట్ లాంటి కొన్ని సంస్థలు చేస్తున్నటువంటి మోసాలకు వినియోగదారిలో విపరీతంగా నష్టపోతున్నారని అన్నారు. తమకు జరిగిన కష్టనష్టాలకు జిల్లా వినియోగదారుల కమిషన్లు, రాష్ట్ర కమిషన్లు, జాతీయ కమిషన్లు, రాష్ట్రంలోని వినియోగదారుల సంఘాలు పనిచేస్తున్నప్పటికీ సత్వర న్యాయం వినియోగదారుడు పొందలేకపోతున్నారని అన్నారు. ఈ తరుణంలో భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ వినియోగదారుల సంఘాల కోరిక మేరకు వినియోగదారుల సౌలభ్యం కోసం 2019 వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టని రూపకల్పన చేయడం జరిగిందని, మోసపూరిత ప్రకటనలు యాడ్ ఇచ్చేటువంటి సెలబ్రిటీలకు 50 లక్షల వరకు జురుమానా తో పాటు జైలు శిక్ష విధించేఅవకాశం ఉందన్నారు. కల్తీలు చేసిన వారికి కూడా జైలు శిక్షతోపాటు జుర్మాన విధించే విధంగా ఆన్లైన్ కొనుగోలు చేసే వాళ్ళు కూడా కష్టం నష్టం జరిగితే వినియోగదారుల కమిషనర్లను ఆశ్రయించవచ్చన్నారు. భారత ప్రభుత్వం సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, తప్పుడు ప్రచారం మోసాలు చేసే పెద్ద పెద్ద కంపెనీల పైన కూడా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేస్తే తక్షణం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ డిస్టిక్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీస్ ని కూడా పనిచేస్తూ ఉన్నాయి, కావున వినియోగదారులు వినియోగదారుల సంఘాల ప్రతినిధులు తమ ఇంటి వద్ద నుండే తమ మొబైల్ ఫోన్ల ద్వారా అంతర్జాలం ద్వారా ఫిర్యాదులు చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు.

