పంట పొలాలకు నీరు అందక పంట వేయలేని పరిస్థితి
బతుకమ్మ: బిచ్కుంద : చివరి ఆయకట్టు వరకు ఉన్న పంట పొలాలకు నీరు అందించి రైతుల కష్టాలను తీర్చుతామంటున్న పాలకులు, అధికారులు మాటల్లో తప్ప చేతల్లో చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డిజిల్లా నస్రుల్లాబాద్ మండలం కంశెట్టిపల్లిగ్రామంలో కాలువకు పక్కనే ఉన్న పొలాలకు నీరు అందక పంటలు వేయలేని పరిస్థితి దాపురించింది. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నసుల్లాబాద్ మండలం కంశేట్పల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నందున రోడ్డుకు ఇరువైపులా ఉన్న రైతులకు పంటకు నిరు అందేలా కల్వర్టులు నిర్మించాల్సి ఉన్నప్పటికిని కేవలం అక్కడక్కడ నిర్మించి చేతులు దులుపుకోవడంతో మిగతా రైతులకు నీరు అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తలెత్తింది నిజాంసాగర్ కాలువ 25 నుండి నిత్యం నీటి సరఫరా ఉన్నప్పటికిని రోడ్డు నిర్మాణ పనులు శాపంగా మారి కల్వర్టుల నిర్మాణం లేక పంట వేసుకునే పరిస్థితి లేక రైతులు లబోదిబోమంటున్నారు. తలాపునె నీళ్లు ఉన్న చాప దూపకేడ్చినట్టు పక్కనే నీళ్లు ఉన్న పంటలు వేయలేని పరిస్థితి ఉంది అంటూ రైతులు మనోవేదనను అనుభవిస్తున్నారు. ఇట్టి విషయమై ఎమ్మార్వో. ఆర్డీవో లకు పలుమార్లు వినతిపత్రం ఇచ్చినప్పటికిని ఎటువంటి లాభం లేదని ఇప్పటికైనా పాలకుల స్పందించి రోడ్డుకు కల్వర్టుల నిర్మించి రైతులను ఆదుకోవాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం వరి నాటు పనులు ప్రారంభమైనప్పటికిని నీటి వసతులు లేక తమ పొలాలను పడితులుగా(వృధాగా) ఉంచాల్సిన పరిస్థితి వస్తుందేమో అని రైతులు కలత చెందుతున్నారు. ప్రజా ప్రతినిధులారా కాస్త పట్టించుకోండి అంటూ రైతులు మొరపెట్టుకుంటున్న ఘటనకు నసుర్ల బాద్ మండలం కంశేట్పల్లి వేదికగా మారింది.

