అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనిల రైతుల పరిస్థితి
పంట పొలాలకు నీరు అందక పంట వేయలేని పరిస్థితి బతుకమ్మ: బిచ్కుంద : చివరి ఆయకట్టు వరకు ఉన్న పంట పొలాలకు నీరు అందించి రైతుల కష్టాలను తీర్చుతామంటున్న పాలకులు, అధికారులు మాటల్లో తప్ప చేతల్లో చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డిజిల్లా నస్రుల్లాబాద్ మండలం కంశెట్టిపల్లిగ్రామంలో కాలువకు పక్కనే ఉన్న పొలాలకు నీరు అందక పంటలు వేయలేని పరిస్థితి దాపురించింది. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నసుల్లాబాద్ మండలం కంశేట్పల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నందున రోడ్డుకు ఇరువైపులా ఉన్న...