28.8 C
Hyderabad
Monday, August 3, 2026

నేనే అల్లు అర్జున్ ఐతే రేవతి కుటుంబానికి రూ.300 కోట్లు సహయం చేసేవాడిని

Must read

📰 Generate e-Paper Clip

. . . నిజామాబాద్ లో మీడియాతో ప్రజా శాంతి పార్టీ నేత కె ఏ పాల్

 నిజామాబాద్, బతుకమ్మ:

నేనే అల్లు అర్జున్ ఐతే రేవతి కుటుంబానికి రూ.300 కోట్ల సహాయం చేసే వాడిని అని ప్రజా శాంతీ పార్టి అధినేత కేఏ పాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేఏ పాల్ విలేఖరులతో మాట్లాడుతు..అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 25 కోట్లు ఇవ్వాలని ఓ. యూ. విద్యార్థులు డిమాండ్ చేయడం తప్పా అని ప్రశ్నించారు.సిఎం రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగ పరిపాలన చేస్తు 422 బిల్డింగ్ లు అక్రమంగా కూల్చివేశారు అన్నారు. సిఎం తన తమ్ముడి బిల్డింగ్ ఎందుకు కూల్చలేదు, నాగార్జున బిల్డింగ్ ఎందుకు కూల్చారు సమాధానం చెప్పాలన్నారు.  తెలంగాణలో రేవంత్ ట్యాక్స్ వసూలవు తోందనీ పిర్యాదులు వస్తున్నాయి. కాంగ్రెస్ ,బిఅర్ఎస్ ప్రభుత్వలవి పచ్చి అబద్ధాలే. రెండు ప్రభుత్వాల్లో సర్పంచులు అప్పుల పాలయ్యారు. నా మద్దతుతోనే రేవంత్ సీఎం అయ్యారు. రేవంత్ నన్ను వాడుకొని వదిలేశాడు ,పదవులు శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని కేఏ పాల్ గుర్తు చేశారు.  గ్రామ పాలన కోసం నా పర్యటనలు మే 10 లోపు 100 గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తాను..మరో రెండేళ్లలో జామిలి ఎన్నికలు ఖాయం అని కేఏ పాల్ అన్నారు.

If I Allu Arjun iam helf for Revathi's family with Rs.300 crores

 

More articles

Latest article