29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పరిచయాల పేరుతో మోసం

Must read

📰 Generate e-Paper Clip

  • అద్దెకు తీసుకున్నకాస్ట్లీ కారులలో తిరుగుతు
  •  ధనవంతుడినని బౌన్సర్ లను  పెట్టుకుని
  •  మోసం చేసిన కేటుగాడిని అరెస్టు చేసిన పోలీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  తాను చాలా ధనవంతుడినని.. అందుకు తగ్గట్టు బౌన్సర్ లను పెట్టుకుని, అద్దెకు తీసుకున్నకాస్ట్లీ కారులలో తిరుగుతు ఒక మహిళకు వాణిజ్య సముదాయం లో షాప్ ఇప్పిస్తానని రూ.25 లక్షలు తీసుకుని మోసం చేసిన మోసగాడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని నాల్గవ టౌన్ ప్రాంతానికి చెందిన మహిళ ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ లోని టిడి గుట్టకు చెందిన అహ్మద్ ఖాన్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ముసుగులోని కేటుగాడిని అరెస్టు చేశారు. అహ్మద్ ఖాన్ ఎప్పుడు కాస్ట్లీ కారులో తిరుగుతు, బౌన్సర్ లను పెట్టుకుని చాలా ధనవంతుడినని, తనకు లీడర్లు, లాయర్లు, జడ్జీలతో పరిచయాలను ఉన్నాయని నగరానికి చెందిన మహిళను నమ్మించారు. తాను హైదరాబాద్ జూబ్లి హిల్స్ లో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాని అందులో ఒక మడిగే ఇస్తానని  రూ.25 లక్షలు తీసుకున్నారు. అయితే తనకు ఇప్పిస్తానని చెప్పిన మడిగే కోసం అహ్మద్ ఖాన్ ను చాలాసార్లు అడిగిన అతడు బుకాయించాడు. బాధితురాలు నేరుగా హైద్రాబాద్ వెళ్లి అహ్మద్ ఖాన్ చెప్పిన చోట చూస్తె ఎలాంటి వాణిజ్య సముదాయం కనిపించకపోవడంతో అతన్ని నిలదీసింది. దానితో అతడు డబ్బులు అడిగితే చంపుతానని బెదిరించాడు. బాధితురాలు పోలీసుకు ఫిర్యాదు చేయడంతో నాల్గవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం అహ్మద్ ఖాన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Fraud in the name of contacts

More articles

Latest article