30.9 C
Hyderabad
Monday, August 3, 2026

సర్వ మతాలను ఒకే దృష్టితో చూడడం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ గొప్పతనం

Must read

📰 Generate e-Paper Clip

నుడా చైర్మన్ కేశవేణు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సపోస్ క్రిస్మస్ వేడుకలు జరపడం ఆనందాన్ని కలిగించిందని నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు అన్నారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో సి ఎస్ ఐ చర్చి సౌజన్యంతో సపోస్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపారు.

Nizamabad Press Club Committee is great to see all religions with one eye

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కేశ వేణు మాట్లాడుతూ సర్వమతలకు అతీతంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులు హిందువుల గణపతి నవరాత్రి ఉత్సవాలు, ముస్లిం సోదరుల రంజాన్ వేడుకలు, క్రిస్టియన్ సోదరుల క్రిస్మద్ సంబరాలను జరపడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్బంగా సి ఎస్ ఐ చర్చి ప్రతినిధులు, యువకులు పాటలు పాడుతూ సందడి చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల రత్నాకర్,చర్చి ఫాదర్ రెవరెండ్ ప్రకాష్, ప్రసిడెంట్ జకరియా, ప్రెస్ క్లబ్ అధ్యక్షా కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad Press Club Committee is great to see all religions with one eye

More articles

Latest article