నుడా చైర్మన్ కేశవేణు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సపోస్ క్రిస్మస్ వేడుకలు జరపడం ఆనందాన్ని కలిగించిందని నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు అన్నారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో సి ఎస్ ఐ చర్చి సౌజన్యంతో సపోస్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కేశ వేణు మాట్లాడుతూ సర్వమతలకు అతీతంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులు హిందువుల గణపతి నవరాత్రి ఉత్సవాలు, ముస్లిం సోదరుల రంజాన్ వేడుకలు, క్రిస్టియన్ సోదరుల క్రిస్మద్ సంబరాలను జరపడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్బంగా సి ఎస్ ఐ చర్చి ప్రతినిధులు, యువకులు పాటలు పాడుతూ సందడి చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల రత్నాకర్,చర్చి ఫాదర్ రెవరెండ్ ప్రకాష్, ప్రసిడెంట్ జకరియా, ప్రెస్ క్లబ్ అధ్యక్షా కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
