బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన సిద్ధవ్వ అనే వృద్ధురాలిని గత రాత్రి కంపెనీ కి చెందిన బస్సు ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కంపెనీ వద్ద ఎలాంటి గొడవలు సంఘటన జరగకుండా భిక్కనూరు ఎస్సై సాయికుమార్ ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున పోలీసులు పహార నిర్వహించారు. కాగా మృతరాలి సిద్దవ్వ కుటుంబ సభ్యులకు బస్సు కాంట్రాక్టు,యాజమాన్యం గ్రామస్తులు, ఆయా పార్టీల నాయకుల సమక్షంలో రూ. 6 లక్షలు, ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకోవడంతో ఎలాంటి ఆందోళన జరగలేదు.

