28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మున్సిపల్ ఆదాయ పన్ను శాఖ అధికారులతో కమిషనర్ సమీక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న దుకాణ సముదాయాల ఆస్తి పన్ను కు సంబంధించిన వివరాలను గురువారం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సంబంధిత రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న దుకాణ ప్రభుత్వ, ప్రైవేటు దుకాణ సముదాయాలలో నెలవారీగా ఎంత పన్ను వసూలు చేస్తున్నారో నెలనెలా దుకాణ సముదాయాల నిర్వాహకులు ఆస్తి పన్నును సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కచ్చితంగా ఆస్తి పన్ను విషయంలో  ప్రభుత్వం నిర్దేశించిన తేదీ ప్రకారం పన్ను నువ్వు వసూలు చేయాలని ఎక్కడ కూడా పెండింగ్లో ఉండకుండా చూడాలని అధికారులకు సూచించారు. పన్ను చెల్లింపు లో ఎవరైనా జాప్యం చేస్తే  వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పన్ను వసూలు చేయడంలో కూడా అధికారులు అంతే శ్రద్ధ వహించాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

More articles

Latest article