25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సబ్ జైలులో ఖైదీకి గుండెపోటు

Must read

📰 Generate e-Paper Clip

జగిత్యాల, బతుకమ్మ:  అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం కు సబ్ జైలులో గుండెపోటు వచ్చింది. 15 రోజుల క్రితం సబ్ జైలుకు వచ్చిన మల్లేశంకు బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో జైలు అధికారులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామన్నపేట ఉప సర్పంచ్ గా పని చేసిన మల్లేశంను తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. నిన్న మధ్యాహ్నం గుండెపోటు వస్తే చనిపోయే వరకు తమకు సమాచారం అందించలేదని ఆరోపించారు.

More articles

Latest article