24.1 C
Hyderabad
Monday, August 3, 2026

కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

Must read

📰 Generate e-Paper Clip

జక్రాన్ పల్లి, బతుకమ్మ: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను మండలంలోని బ్రాహ్మణపల్లిలో అంబేద్కర్ యువజన నాయకులు దహనం చేశారు. అమిత్ షా వెంటనే అంబేద్కర్ కు క్షమాపణ చెపాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవరాజ్, ఎంపీటీసీ రాజు, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు సాగర్, అరుణ్, లక్ష్మణ్, సతీశ్, ప్రభాకర్, సత్యనారాయణ, అనిల్, రాజ్ కుమార్, సురేందర్, ప్రవీణ్, ఇమ్మానియేల్, వినోద్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article