27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నందిపేట్: నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు బుధవారం పరీక్ష ప్యాడ్స్ మరియు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు పరీక్షల్లో ఒత్తిడికి గురికాకుండా సన్నద్ధం కావాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు సూచించారు. వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థినికి ఐలాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ శౌరి బాబు, సాయిరెడ్డి, భూమన్న, మహిపాల్, నర్సయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Distribution of examination pads to class X students

More articles

Latest article