28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లాస్థాయి జీవశాస్త్ర ప్రతిభ పరీక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని రాధాకృష్ణ పాఠశాలలో జిల్లాస్థాయి జీవశాస్త్ర ప్రతిభ పరీక్ష బుధవారం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాలలోని విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి ప్రతిభా పరీక్షలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఫోరం జిల్లా కమిటీ అధ్యక్షులు ఇడేపు శేఖర్, ప్రధాన కార్యదర్శి అందే గోవర్ధన్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, రాష్ట్ర పోరం బాధ్యులు ఎంవీఆర్ చారి, సాయిబాబా, ప్రశాంత్, సాయినాథ్, మధుసూదనాచారి, లక్ష్మణ్,సంతోష్ యాదవ్,  శ్రీనివాస్ పాల్గొన్నారు.

District Level Biology Aptitude Test

More articles

Latest article