నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని రాధాకృష్ణ పాఠశాలలో జిల్లాస్థాయి జీవశాస్త్ర ప్రతిభ పరీక్ష బుధవారం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాలలోని విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి ప్రతిభా పరీక్షలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఫోరం జిల్లా కమిటీ అధ్యక్షులు ఇడేపు శేఖర్, ప్రధాన కార్యదర్శి అందే గోవర్ధన్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, రాష్ట్ర పోరం బాధ్యులు ఎంవీఆర్ చారి, సాయిబాబా, ప్రశాంత్, సాయినాథ్, మధుసూదనాచారి, లక్ష్మణ్,సంతోష్ యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
