26.2 C
Hyderabad
Monday, August 3, 2026

7.04 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా

Must read

📰 Generate e-Paper Clip

 ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీటీసీ కర్రే వార్ రాములు

బతుకమ్మ,మద్నూర్: మద్నూర్ మండల కేంద్ర గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇండ్ల స్థలాల భూమి సర్వే నెంబర్లు 583, 584, 846, ఈ మూడు సర్వే నంబర్లలో మొత్తం 7.04 ఎకరాల  ప్రభుత్వ భూమిని ఇద్దరు వ్యక్తులు కబ్జా చేసినట్లు ప్రజావాణిలో కామారెడ్డి జిల్లా కలెక్టర్కు మద్నూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు కర్రే వార్ రాములు ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుపై మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ భూమి అక్రమంగా కబ్జా చేసినట్లు 16 రకాల కాపీలను ఆయన విలేకరులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రెవిన్యూ  ధరణి రికార్డుల్లో ఈ మూడు సర్వే నెంబర్లలో గల భూమి ప్రభుత్వ ఇండ్ల స్థలాల భూమిగా రికార్డుల్లో ఉందని తెలిపారు. ప్రస్తుతం ధరణి రికార్డు ప్రకారం కలెక్టర్కు రుజువులతోపాటు ఫిర్యాదు చేసినట్లు  తెలిపారు. సర్వే నెంబర్ 583లో 2.01 ఎకరాలు, సర్వే నెంబర్ 584లో 3.11 ఎకరాలు, సర్వే నెంబర్ 846లో 1.32 ఎకరాలు మొత్తం కలిసి 7.04 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇద్దరు మద్నూర్ మండల కేంద్రానికి చెందిన వ్యక్తులే కబ్జా చేసినట్లు తెలిపారు. సర్వే నెంబర్ 584 లో గల 3.11 ఎకరాల భూమిలో ఒక వ్యక్తి పత్తి మిల్లు కోసం కబ్జా చేశారని, మరొక వ్యక్తి సర్వే నెంబర్లు 583, 846లో గల ప్రభుత్వ ఇండ్ల స్థలాల భూమిని కబ్జా చేసి చట్ట వ్యతిరేకంగా పట్ట మార్పిడి చేసుకొని అందులో భవనాలు నిర్మించుకొని ఇంకా కొంత భూమిని ఇతరులకు విక్రయించినట్లు తెలిపారు. ఈ సర్వే నెంబర్ల భూమి 1972లో ప్రభుత్వం గజిట్ చేసుకోవడం జరిగిందని, అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ భూములపై నిఘా పెట్టకపోవడం అక్రమ కబ్జాలకు గురైందని, వీటిని స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వ పరంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి ఎంతో అనుకూలమైన స్థలాలు ఉన్నాయని, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపౌ చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

More articles

Latest article