- అమరవీరుల రక్తతర్పనతో శ్రమజీవుల రాజ్యాన్ని నిర్మిద్దాం
- సీపీఐ(ఎం. ఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపు
భీమ్ గల్, బతుకమ్మ : ప్రజాపంథా నేత అమరజీవి, విప్లవ యోధుడు కామ్రేడ్.పిట్ల ఎల్లన్న ఆశయాల సాధనకు పునరంకితమదాం అని, అమరవీరుల రక్తతర్పనతో శ్రమజీవుల రాజ్యాన్ని నిర్మిద్దాం అని సీ పీ ఐ (ఎం. ఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం భీమ్ గల్ మండల కేంద్రంలో గల పిట్ల ఎల్లన్న స్థూపం వద్ద పిట్ల ఎల్లన్న 34వ, వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలతో నివాళులు హార్పించి జోహార్లు ఆర్పించారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ మాట్లాడుతు సిపిఐ (ఎంఎల్) ప్రజా పంథా నాయకుడిగా, రైతుకూలీ సంఘం నేతగా కామ్రేడ్.పిట్ల ఎల్లన్న గ్రామీణప్రాంతంలో అనేక రైతంగా పోరాటాలు నిర్వహించిన విప్లవ పోరాట యోధుడు అన్నారు. రైతు కూలి సంఘాలను గ్రామ గ్రామాన నిర్మాణం చేసి విప్లవోద్యమ అభివృద్ధికి కృషి చేస్తున్న కామ్రేడ్ పిట్ల ఎల్లన్నను చూసి, బలమైన ఉద్యమాలు నిర్మిస్తున్న ప్రజాపంథా పార్టీ పై కక్షపూనిన అతివాదపంథాను ఎంచుకున్న మావోయిస్టు, ఆనాటి పీపుల్స్ వార్ కామ్రేడ్ పిట్ల ఎల్లన్నను హత్య చేశారన్నారు. ఆయన ఆశయం ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. ప్రజలే చరిత్ర నిర్మతలని మావో చెప్పిన ప్రకారంగా సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) ప్రజాపోరాటాలతో ముందుకెళ్తుందన్నారు. తనని హత్యచేసిన తన ఆశయాన్ని మాత్రం మేము కొనసాగిస్తున్నాం అన్నారు. కామ్రేడ్ పిట్ల ఎల్లన్న ఆశయాలు సాధించడం అంటే బలమైన విప్లవ నిర్మాణం, శ్రామికుల శ్రమరాజ్యం సాధించడమే అన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ భీంగల్ మండల కార్యదర్శి కె.రాజేశ్వర్, ఆర్మూర్ డివిజన్ నాయకులు జిలకర నడ్పినర్సన్న,ఆర్.దామోదర్,బి.బాబన్న,జి.సాయిరెడ్డి,ఈ.రమేష్, అంబిక. గంగాధర్,కె.ఆశిస్,సీహెచ్.రాజేశ్వర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు అనిస్,యు.అశోక్ తదితరులు పాల్గొన్నారు.
