కబ్జా వద్ద దళితుల నిరసన
కామారెడ్డి, బతుకమ్మ: ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామని భయభ్రాంతులను గురిచేస్తు 15 మంది దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కబ్జా చేస్తున్నారని వారు వాపోయారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాత రాజంపేట గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 114/41 లో గల 5 ఎకరాల భూమి 15 మంది పొత్తుల గల భూమిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో, సివిల్, పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ముగ్గురు కలిసి కబ్జా చేస్తూ అక్రమంగా మా భూమిని దున్నుతున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అదివారం సంబంధిత భూమిలో జెసిబి, టాక్టర్ పెట్టి చదును చేస్తే అడ్డుపడితే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అడ్డస్తే చంపివేస్తామని బెదిరిస్తున్నారని వారితో మాకు ప్రాణహాని ఉందని అన్నారు. తమ భూముల కబ్జాపై కామారెడ్డి ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందని, అంతేకాకుండా జిల్లా ఎస్పీ కి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని అయినా కూడా వారు పట్టించుకోవడంలేదని తెలిపారు. వారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని అందుకే అధికారులు పట్టించుకోవడంలేదని అదే గ్రామానికి చెందిన గణపురం రాజయ్య, బాలయ్య, లింగం, రమేష్, అరుణ్, మహేందర్, రాజేందర్, మణెమ్మ, లత రాజవ్వ తెలిపారు.ఇప్పటికైనా జిల్లా ఎస్పీ సింధు శర్మ, జిల్లా కలెక్టర్ స్పందించి మాకు స్పందించి 5ఎకరాల భూమిని 15 మంది కుటుంబ సభ్యులకు ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు.

