28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

 ప్రమాద బీమా చెక్కులు పంపిణీ 

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ,  మాచారెడ్డి: బీ ఆర్ ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ఆదివారం ‌కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రమాద బీమా చెక్కలు పంపిణీ చేశారు. మాచారెడ్డి మండలం లచ్చపేట్ గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలైన  కైరంకొండ శివరాములు, జక్కుల రాంచంద్రం ప్రమాదవశాత్తు మరణించారు.  వారి కుటుంబాలకు ఆదివారం  ప్రమాదబీమా చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు సమయంలో వారి పేర్ల పై ప్రమాదబీమా పాలసీలను  పార్టీ చేయించింది.  ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని అధిష్ఠానం ఆలోచన చేసిందన్నారు. ఒక్కో కార్యకర్త కు 2 లక్షల ప్రమాద బీమా చేయించినట్టు వివరించారు. అందులో భాగంగా చేపల వేటకు వెళ్ళి వరదలో చిక్కుకున్న శివరాములు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జక్కుల రాంచంద్రం కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను ఆయన నివాసం లో అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్ పీ టీ సీ మిన్కూరి రాంరెడ్డి, బీ ఆర్ ఎస్ నాయకులు నల్లవెల్లి ఆశోక్, శంకర్, గెరిగంటి లక్ష్మినారాయణ, లచ్చపేట్ మాజీ ఎంపీటీసీ బూస శ్రీనివాస్, లద్దూరి కృష్ణ యాదవ్, దినేష్  లచ్చపేట్ గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article