ప్రమాద బీమా చెక్కులు పంపిణీ
బతుకమ్మ, మాచారెడ్డి: బీ ఆర్ ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ఆదివారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రమాద బీమా చెక్కలు పంపిణీ చేశారు. మాచారెడ్డి మండలం లచ్చపేట్ గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలైన కైరంకొండ శివరాములు, జక్కుల రాంచంద్రం ప్రమాదవశాత్తు మరణించారు. వారి కుటుంబాలకు ఆదివారం ప్రమాదబీమా చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు సమయంలో వారి పేర్ల పై ప్రమాదబీమా పాలసీలను పార్టీ చేయించింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని...